నటుడు చలపతిరావు పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

- May 23, 2017 , by Maagulf
నటుడు చలపతిరావు పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

నటుడు చలపతిరావుపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మహిళా సంఘాలు ఆయనపై ఫిర్యాదు చేశాయి. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా ఆడియో పంక్షన్‌లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపిస్తున్నారు. ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అంటూ జరిగిన సంభాషణలో ఆయన మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరమంటూ భూమిక ఫౌండేషన్ మండిపడుతోంది.

ఐతే, ఈ ఆరోపణలు, విమర్శలపై చలపతిరావు స్పందించారు. తనకు ఎవర్నీ కించపరిచే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com