బీట్ రూట్ కజ్జికాయలు
- May 24, 2017
కావలసిన పదార్థాలు: బీట్ రూట్ తురుము - 2 కప్పులు, క్యారెట్ తురుము - 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము - రెండు కప్పులు, మైదా - 350 గ్రా., జీడిపప్పు, బాదం - పది చొప్పున, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, నూనె - వేగించడానికి సరిపడా, ఏలకుల పొడి - అర టీ స్పూను, పంచదార పొడి - రెండు కప్పులు, (కాచిన) పాలు - ఒకటిన్నర కప్పు, తేనె - 2 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం: మైదాలో 1 స్పూను నెయ్యి, తేనె, పాలు వేసి ముద్దలా కలుపుకోవాలి. కడాయిలో మిగతా నెయ్యి వేసి జీడిపప్పు, బాదం వేగించి తీసేసి, అందులోనే బీట్రూట్, క్యారెట్, కొబ్బరి తురుము ఒకదాని తర్వాత ఒకటి వేగించాలి. ఒక పళ్లెంలో వేగించిన తురుములు, ఏలకుల పొడి, జీడిపప్పు, బాదం, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. మైదా ముద్దని ఉండలుగా చేసుకొని, పూరీల్లా వత్తుకోవాలి. పూరీల మధ్యలో తగినంత తురుము మిశ్రమాన్ని పెట్టి, కజ్జికాయల్లా వత్తి నూనెలో దోరగా వేగించుకోవాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









