2000 మంది ముస్లింలతో యోగా చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ
- May 24, 2017
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న లఖ్‌నవూలోని అంబేడ్కర్ మైదానంలో జరిగే కార్యక్రమంలో 2వేల మంది ముస్లిం మతపెద్దలతో కలిసి ప్రధాని నరేంద్రమోదీ యోగాసనాలు వేయనున్నారు. దీనిలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొంటారు. ముస్లింలతో పాటు హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, యూదులు కూడా కార్యక్రమానికి హాజరవుతారని ఆయుష్ మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఆరెస్సెస్ మద్దతు ఉన్న స్వచ్ఛంద సంస్థ- ఆయుష్మాన్, యూపీ సర్కారు ఈ కార్యక్రమ నిర్వహణకు సహకారాన్ని అందిస్తున్నాయి. ఈసారి యోగా దినోత్సవంలో ఆసనాలు వేయడానికి పెద్దఎత్తున ప్రజలు తరలి వస్తారని భావిస్తూ దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. భిన్న మతాలకు చెందిన ప్రజలు ఒకే చోట పెద్దసంఖ్యలో చేరి యోగా చేయడాన్ని ప్రపంచ రికార్డుగా గుర్తించేందుకు ‘గిన్నిస్ బుక్’ ప్రతినిధులూ లఖ్‌నవూకు రాబోతున్నారు. మరోపక్క ఒకప్పుడు దంతధావనానికి విస్తృతంగా ఉపయోగించిన వేప పుల్లల్ని మళ్లీ ఇప్పుడు కొన్ని బ్రాండ్ల పేరుతో అందుబాటులోకి తీసుకురావాలని ఆయుష్ మంత్రిత్వశాఖ నిర్ణయించింది.
తాజా వార్తలు
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం
- సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
- కతార్ ఎమిర్–అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- ICC Mens T20 World Cup Final: ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్ పై భారత్ భారీ స్కోర్
- కువైట్ గగనతలం తాత్కాలిక మూసివేత
- ఇరాన్ పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- ఒమన్ లో సాధారణ స్థితికి రవాణా కార్యకలాపాలు..!!
- ఫుడ్, నాన్ ఫుడ్ లభ్యత పై అవుట్లెట్లు భరోసా..!!









