దోలా-సాదియా భారత్ దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జ్
- May 25, 2017
భారత్: భారత్ దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జ్‌కు శుక్రవారం ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అస్సాంలో ఉన్న ఈ ఫాస్ట్ ట్రాక్ బ్రిడ్జ్ ఆర్మీ ఇండియా-చైనా బోర్డర్‌కు చాలా కీలకమైనది. ఈ వంతెన నిర్మాణానికి 2011లో అప్పటి ప్రధాని మన్మోహన్ శంకుస్థాపన చేసినా... నిర్మాణం మాత్రం జరగలేదు. అయితే ఇండియా-చైనా బోర్డర్లో కీలకమైన ఈ ప్రాజెక్ట్‌ను సీరియస్‌గా తీసుకున్న కేంద్రం నిధులు కేటాయించి... మూడేళ్లలో పూర్తి చేసింది.
దోలా-సాదియా మధ్య లోహిత్ నదిపై ఈ బ్రిడ్జ్‌ను నిర్మించారు. ఈ వంతెన పొడవు 9కిలోమీటర్లుకాగా... అస్సాం రాజధాని గౌహతికి సరిగ్గా 540 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు 300 కిలోమీటర్ల దూరం. అస్సాం-అరుణాచల్ ప్రదేశ్ మధ్య రాకపోకలకు ఈ బ్రిడ్జ్ కీలకమైనది. అలాగే అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్‌కు నాలుగు గంటల్లో చేరుకోవచ్చు.
ప్రధానంగా ఆర్మీకి ఈ బ్రిడ్జ్ అత్యంత కీలకమైనది. అస్సాం నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌లోని చైనా బోర్డర్‌కు వెళ్లేందుకు ఈ వంతెన ప్రధానమైనది. అంతేకాదు 60 టన్నుల బరువుండే యుద్ధ ట్యాంకులు బ్రిడ్జిపై నుంచి వెళ్లినా తట్టుకునేలా నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి 950 కోట్లు ఖర్చయ్యింది.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









