అమెరికాలో పరువుతీస్తోన్నహిందూ ఆలయ పూజారి

- May 26, 2017 , by Maagulf
అమెరికాలో పరువుతీస్తోన్నహిందూ ఆలయ పూజారి

అమెరికాలోని జార్జియాలో హిందూ ఆలయ పూజారి చేస్తున్న నిర్వాకాల్ని ఎండగట్టింది అట్లాంటాలోని మై ఫాక్స్ అట్లాంటా అనే టీవీ ఛానల్. తన ఐ టీం అనే ప్రోగ్రామ్ ద్వారా సెల్వం సిద్ధార్థ్ అనే స్వయం ప్రకటిత బాబా చేష్టల మీద డేగకన్ను వేసి తూర్పారబట్టింది. దైవం పేరిట సదరు స్వామి చేస్తున్న నిర్వాకాల్ని ఆలయంలో పనిచేస్తున్న యువ పూజారులు స్వయంగా చెప్పడం విశేషం.
ఈ టెంపుల్ లోకి చెప్పులు, షూస్ ని అనుమతించరుకాని, మనీ పర్సులు మాత్రం అంగీకరిస్తారంటూ మొదలు పెట్టి, దైవసేవల పేరుతో భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న సెల్వం బాగోతాలన్నింటినీ సాక్షాధారాలతో సహా బయటపెట్టింది. ప్రజల దగ్గర భారీ మొత్తంలో సొమ్ములు వసూలు చేసి సదరు దొంగ స్వామి గడుపుతున్న విలాసవంతమైన జీవితాన్ని కూడా తన విజువల్స్ లో చూపించింది. ఖరీదైన కార్లు, విలాసవంతమైన బంగ్లా లను ఆ ప్రోగ్రామ్ లో చూపించారు. తనకు తాను స్వామిగా ప్రకటించుకుని భారీగా భక్తుల నుంచి వసూళ్లు చేస్తున్నాడని, స్వామి అనేందుకే సెల్వం అనర్హుడని ఆలయంలో పనిచేస్తున్న పూజారులే స్వయంగా వెల్లడించడం విశేషం. కాగా, సెల్వం సిద్దార్థ్ మోసాలపై గతంలోనూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com