వినాయక్ తో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్
- May 28, 2017
మెగా స్టార్ చిరంజీవి తో ఖైదీ నెం 150 వంటి బ్లాక్ బస్టర్ హిట్ తెరకెక్కించిన వి వి వినాయక్ , మరోసారి మెగా ఫోన్ పట్టుకున్నాడని తెలుస్తుంది. తిక్క , విన్నర్ చిత్రాల ప్లాప్స్ తో డీలా పడ్డ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఓ మాస్ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇప్పుడున్న డైరెక్టర్స్ లలో మాస్ చిత్రం తెరకెక్కించాలంటే ఒక్క వినాయక్ మాత్రమే. అందుకే ఈయన చూపు ఈ డైరెక్టర్ పడిందని తెలుస్తుంది.
సాయిధరం తేజ్ తో వివి వినాయక్ మూవీ అంటూ గతంలో వార్తలొచ్చాయి కానీ.. ఇప్పుడీ ప్రాజెక్ట్ కన్ఫాం అంటున్నారు మెగా అభిమానులు. ఇప్పటికే ఓ మాంచి యూత్ సబ్జెక్టును రెడీ చేసుకున్న వినాయక్.. తేజుతో డిస్కషన్స్ పూర్తి చేసేశాడట. ప్రస్తుతం ఆ స్టోరీకి తన అసిస్టెంట్స్ తో కలిసి తనదైన స్టైల్ లోకి మార్చుకుంటూ మెరుగులు దిద్దుతున్నట్లు చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట.. అంతే కాదు ఈ మూవీలో లావణ్య త్రిపాఠి ని హీరోయిన్ గా ఎంపిక చేసారని తెలుస్తుంది.
ఇప్పటికే అల్లు శిరీష్.. వరుణ్ తేజ్ లతో రొమాన్స్ చేసిన లావణ్య త్రిపాఠికి.. ఇప్పుడు తేజు తో జోడి కట్టబోతుంది. ప్రస్తుతం తేజు బీవీఎస్ రవి దర్శకత్వంలో జవాన్.. సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో ఓ చిత్రం చేస్తున్నాడు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







