ఎపి, తెలంగాణలో జికా వైరస్ అలర్ట్
- May 28, 2017
జికా వైరస్ దెబ్బకు తెలుగురాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ఎయిర్ పోర్ట్ లు, పోర్ట్‌లను అప్రమత్తం చేశారు. ఈ వ్యాధి సోకిన వాళ్లెవరైనా ఉన్నారేమోనని ముమ్మరంగా వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలనుంచి వస్తోన్న వాళ్లపై గట్టి నిఘా పెట్టారు.
ఇదిలాఉండగా, ఆఫ్రికా దేశాలను భయభ్రాంతులకు గురిచేసిన ఈ ప్రాణాంతక జికా వైరస్ ఇండియాలోకి ఎంటరైన సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలోని బాపూనగర్ ప్రాంతంలో ముగ్గురికి సోకిన విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిర్ధారించింది. వైరస్ బారినపడిన వారిలో గర్భిణి, 64 ఏళ్ల వృద్ధుడు, బాలింత ఉన్నారు. వీరంతా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాలు, నౌకాశ్రయ ప్రాంతాల్లో మరింత అప్రమత్తత పాటిస్తున్నారు. ఈ దోమకు సీజన్‌తో పని లేదని, ఇంటి చుట్టు పరిసరాల్లో దోమల వృద్ధి చెందకుండా జాగ్రత్త పడాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. శరీరాన్ని పూర్తిగా కవర్ చేసే దుస్తులు వేసుకోవాలని, ఈగలు, దోమలు ముసిరే ప్రాంతాల్ని వెంటనే శుభ్రం చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









