జీతాలు చెల్లించని కంపెనీపై ఫిర్యాదు
- May 29, 2017
మనామా:కొన్ని నెలలుగా కార్మికులకు జీతాలు చెల్లించని ఓ ప్రైవేటు కన్స్ట్రక్షన్ కంపెనీపై స్థానిక హ్యూమన్ రైట్స్ గ్రూప్ ఫిర్యాదు చేసింది. జి.పి. జచారిదెస్ ఒవర్సీస్ లిమిటెడ్ కంపెనీ, గత కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో కార్మికులకు జీతాలు చెల్లించలేకపోతోంది. బహ్రెయిన్ హ్యూమన్ రైట్స్ వాచ్ సొసైటీ (బిహెచ్‌ఆర్‌డబ్ల్యుఎస్) ఈ విషయాన్ని ధృవీకరించింది ఓ ప్రకటనలో. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారనీ, రమదాన్ మాసంలో వారి ఇబ్బందులు ఇంకా పెరగనున్నాయని బిహెచ్‌ఆర్‌డబ్ల్యుఎస్ పేర్కొంది. మైగ్రెంట్ వర్కర్స్ ప్రొటెక్షన్ సొసైటీ, కార్మికులకు కొంతమేర అండగా నిలిచిందనీ, వారికి ఆహారం కొన్నాళ్ళవరకు అందించినా, ఆర్థిక ఇబ్బందులతో ఇప్పుడు ఆ సహాయం అందించలేకపోతోందనీ, లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ జోక్యం చేసుకుని, కంపెనీ ఆస్తుల్ని సీజ్ చేయాలని కోరుతోంది హ్యూమన్ రైట్స్ గ్రూప్.మూడు దశాబ్దాలుగా జిపి.జచారియాదెస్ ఓవర్సీస్ లిమిటెడ్ బహ్రెయిన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







