మహానటి సావిత్రి బయోపిక్ ఆధారంగా ‘మహానటి ’ షూటింగ్ షురూ
- May 29, 2017
వెండితెర ధ్రువతార , మహానటి సావిత్రి బయోపిక్ ఎట్టకేలకు సెట్స్‌మీదకు రానుంది. నాగ్ అశ్విన దర్శకత్వంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ రామకృష్ణ స్టూడియోలో పూజాకార్యక్రమాలు నిర్వహించింది. నాగ్ అశ్విన్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టు అధికారంగా లాంచ్ అయింది. తొలి షాట్ ని లెజండరీ నటుడు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ఫోటోలపై తొలిషాట్‌ను చిత్రీకరించారు. త్వరలోనే సెట్స్‌మీదకువెళ్లనున్నట్టుచిత్ర యూనిట్ ప్రకటించింది.
తెలుగు,తమిళ భాషలలో భారీగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ లో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించనున్నారు. ఇక సావిత్రి జీవితంలో జరిగిన సంఘటనలు తెలుసుకునే జర్నలిస్ట్ పాత్రలో టాలీవుడ్ బ్యూటీ సమంత అలరించనుంది. మరోవైపు సీనియర్ నటి భానుప్రియ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఓ కీలక పాత్ర పోషించనుందని, ప్రస్తుతానికి ఆ పాత్ర వివరాలు సీక్రెట్ అంటున్నాడు నాగ్ అశ్విన్.
సి. అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్నా దత్ నిర్మించనున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కూడా కీ రోల్ పోషిస్తున్నాడట. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ప్రొడ్యూసర్స్ స్వప్న దత్, ప్రియాంక దత్. మహిళా దినోత్సవం రోజు మహానటి సావిత్రి బయోపిక్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







