అమెరికాలో తెలుగు వాసి మృతి
- May 31, 2017
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా చేస్తున్న తెలుగు వాసి, ఆయన కుమారుడు ప్రమాదవశాత్తూ మృతిచెందారు. మంగళవారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన నాగరాజు సురపల్లి మిచిగాన్ లోని డెట్రాయిట్ నగరంలో నివాసం ఉంటున్నారు. నాగరాజు స్థానిక ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తుండేవారు. నిన్న తన అపార్ట్ మెంట్లో ఉండే స్విమ్మింగ్ పూల్‌లో మూడేళ్ల చిన్నారి సహా ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. వెంటనే ఎమర్జన్సీ సర్వీస్ కు కాల్ చేశారు. వారు వచ్చి పరిశీలించి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నాగరాజు, ఆయన మూడేళ్ల కుమారుడు అనంత్ చనిపోయారని నిర్ధారించారు.
నాగరాజు మృతిచెందడంతో గుంటూరులోని ఆయన స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్విమ్మింగ్ పూల్ పక్కన చిన్నారులు ఆడుకునే చిన్న సైకిల్ ఉండటాన్ని గమనిస్తే.. మొదట చిన్నారి అనంత్ స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయి ఉంటాడని, కుమారుడిని కాపాడేక్రమంలో పూల్‌లో దిగిన నాగరాజు చనిపోయి ఉండొచ్చునని అపార్ట్ మెంట్ వాసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే పూల్ తక్కువ లోతు మాత్రమే ఉందని నాగరాజు చనిపోయే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పోలీస్ అధికారి డేవిడ్ మోల్లాయ్ తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!









