హీరో బాలయ్య సలహాతో ఛార్మి ఔట్

- May 31, 2017 , by Maagulf
హీరో  బాలయ్య సలహాతో ఛార్మి ఔట్

బాలకృష్ణ- శ్రియ జంటగా రానుంది ఓ ఫిల్మ్. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం పోర్చుగల్‌లో చిత్రీకరణ జరుగుతోంది. బాలకృష్ణపై యాక్షన్ సీన్స్‌ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. దీనికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది.
ఇందులో ఐటమ్‌ బ్యూటీ ఛార్మీని తీసుకోవాలని యూనిట్ ప్లాన్ చేసినప్పటికీ, చివరి నిమిషంలో సీన్ రివర్స్ అయ్యింది. ఆమె ప్లేస్‌లోకి కైరాదత్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
బాలీవుడ్ డైరెక్టర్ మధూర్ బండార్కర్ తెరకెక్కించిన 'క్యాలెండర్ గర్ల్స్' ఫిల్మ్‌లో ప్రధాన పాత్రలో నటించింది కైరాదత్. స్పెషల్‌సాంగ్ అనగానే కొత్త బ్యూటీ అయితే బాగుంటుందని ఆలోచన పూరీ చేయడం, ఆమెని అప్రోచ్ కావడం అంతా జరిగినట్టు ఇన్‌సైడ్ సమాచారం.
ఛార్మి కంటే కొత్త బ్యూటీ అయితే బాగుంటుందని బాలకృష్ణ సలహా ఇవ్వడంతో కైరాని ఎంపిక చేసినట్టు యూనిట్ చెబుతున్నమాట. 40 రోజులపాటు కీలక సన్నివేశాలు, పాటలు, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ షూట్ చేయనున్నాడు డైరెక్టర్. ఎప్పుడూ తన సినిమాలకు స్పెయిన్‌ని ఎంపిక చేసుకునే పూరీ, ఈసారి పోర్చుగల్‌కి షిఫ్ట్ అయ్యాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com