తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సైకత శిల్పాలు తయారు చేయించిన 'GHMC మేయర్'
- June 01, 2017
హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా హుస్సేన్ సాగర్ తీరాన మన దేశం లోనే మంచి నైపుణ్యం కలిగిన సైకత శిల్పి తరణి ప్రసాద్ మిశ్ర చే హైదరాబాద్ మేయర్ శ్రీ. బొంతు రామ్ మెహన్ రావు కొన్ని సైకత శిల్పాలు తయారు చేయించారు.అందులో తెలంగాణ తల్లి, తెలంగాణ అమరవీరుల స్థూపం మరియు తెలంగాణ రాష్ట్ర చిత్ర పటం లో ముఖ్యమంత్రి కె.సి.ఆర్ శిల్పాలు మాత్రంప్రజలను చాలా ఆకట్టుకొంటున్నాయి.
తరణి ప్రసాద్ మిశ్ర ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా కి చెందిన వ్యక్తి అయినా ముఖ్యమంత్రి కె.సి.ఆర్ పోరాట శైలికి,తెలంగాణ రాష్ట్రములో ఆయన అవలంబిస్తున్న సంక్షేమ పధకాలను చూసి ఆయనకు వీరాభిమానిగా మారారు మిశ్ర లోని నైపుణ్యాన్ని అయన అభిమానాన్ని గుర్తించి మేయర్ బొంతు రామ్ మోహన రావు ఆయనను హైదరాబాద్ కు రప్పించి ట్యాంకుబండ్ ఆవరణలో ఈ సైకత శిల్ప ప్రదర్శనను ఏర్పాటు చేయడం ఎంతో విశేషం సంతరించుకుంది.
సాధారణంగా సముద్ర తీర ప్రాంతాలలో కనిపించే ఈ సైకత శిల్పాలు హైదరాబాద్లో అది హుస్సేన్ సాగర్ తీరంలో కనిపించడం ఇది ప్రధమం.
ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలలో GHMC మేయర్ ఆధ్వర్యంలో జరుగుతున్నఈ సైకత శిల్పాల ప్రదర్శన తెలంగాణ ప్రజలను చాలా ఆకట్టుకోవడం విశేషం.


తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







