ట్విట్టర్లో మోస్ట్ పాపులర్ అరబ్ లీడర్ షేక్ మొహమ్మద్
- June 01, 2017
యు.ఏ.ఈ: యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ట్విట్టర్లో మోస్ట్ పాపులర్ అరబ్ లీడర్‌గా బర్సన్ - మార్స్టెల్లర్ 2017 ట్విప్లోమసీ స్టడీలో ఎంపికయ్యారు. షేక్ మొహమ్మద్ 7.9 మిలియన్ ఫాలోవర్స్‌తో టాప్ పొజిషన్లో నిలిచారు అరబ్ ప్రపంచానికి సంబంధించి. తర్వాతి స్థానంలో జోర్డాన్‌కి చెందిన క్వీన్ రానియా, కింగ్ సల్మాన్ 5 మిలియన్ల ఫాలోవర్స్‌తో నిలిచారు. మహిళా లీడర్లలో క్వీన్ రానియా రెండో స్థానంలో నిలిచారు. భారతదేశానికి చెందిన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ టాప్ పొజిషన్లో నిలిచారు. ఆమెకు 8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఫారిన్ మినిస్టర్ విభాగంలోనూ ఆమే టాప్ పొజిషన్లో ఉండగా, ఆమె తర్వాతి స్థానంలో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నిలిచారు. భారత ప్రధాని నరేంద్రమోడీ, 30 మిలియన్ ఫాలోవర్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్‌తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం









