రస్ అల్ ఖైమా ప్రమాదంలో వ్యక్తి మృతి
- June 01, 2017
రస్ అల్ ఖైమా: 21 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి రస్ అల్ ఖైమాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడంతో, తీవ్రగాయాల పాలయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే పారామెడిక్స్ అండ్ రెస్క్యూ టీమ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. అయితే దురదృష్టవశాత్తూ తీవ్రగాయాలతో అతను మృతి చెందాడు. వేగంగా ప్రయాణిస్తున్న కారు కంట్రోల్ తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. రస్ అల్ ఖైమా పోలీస్ విభాగం, సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ డాక్టర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమైది మాట్లాడుతూ, వాహనదారులు రోడ్డుపై వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనీ, ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం









