తెలంగాణవ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
- June 01, 2017
తెలంగాణ పండగొచ్చింది. రాష్ట్రంలోని ప్రతి నగరం, పట్టణం, పల్లె కొత్త అందాలను అద్దుకుంది.. ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని ముచ్చటగా మూడేళ్లైన సంబరాలు అంబరాన్నంటనున్నాయి. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా జరగుతున్న ఆవిర్భావ వేడుకలు ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో, ఎవరెస్టుపై కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నారు. అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దుబాయ్, కువైట్‌లో కూడా తెలంగానాన్ని ఆలపించనున్నారు
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. జాతీయ జెండా ఆవిష్కరించి.. సైనిక వందనం స్వీకరిస్తారు. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించనున్నారు. రాష్ట్రావతరణ సందర్బంగా వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన 345 మందికి సీఎం రాష్ట్ర స్థాయి అవార్డులను అందించనున్నారు. ఆవిర్భావ దినోత్సవ కానుకగా 417 మంది వృద్ధ కళాకారులకు నెలకు 1500 పించన్ ఇవ్వనున్నారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుక సందర్బంగా రాష్ట్రంలోని ప్రముఖ కట్టడాలు, చారిత్రక ప్రాంతాలు, ఆలయాలు, భవనాలు అన్నీ విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. ప్రత్యేక అలంకరణలతో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలు, ప్రముఖ భవంతులు చీకటిలో హరివిల్లుల్లా మెరిసిపోయాయి. ఆవిర్భావ వేడుకల సందర్బంగా మూడు రోజులపాటు రవీంద్రభారతిలో సాయంత్రం నృత్యం, నాటకాలు,, సమ్మేళనాలు, ఖవ్వాలీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
వేడుకల్లో భాగంగా మూడు రోజులపాటు రాత్రి వేళ తెలంగాణ సంప్రదాయ వంటకాలను పర్యాటక శాఖ అందుబాటులో ఉంచనుంది. బేగంపేటలోని పర్యాటక భవన్‌లో ఫుడ్ ఫెస్ట్ ఏర్పాటు చేయనుంది. కొన్ని హోటళ్లలో కూడా తెలంగాణ ప్రత్యేక వంటకాలు భోజన ప్రియులు రుచిచూడనున్నారు. శిల్పారామం కూడా వేడుకల ఏర్పాట్లు జరిగాయి.
పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం పన్నెండున్నర వరకూ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఏస్పీ రోడ్‌లోని SBH చౌరస్తా నుంచి బేగంపేట వైపు వాహనాలకు ప్రవేశం ఉండదు. CTO చౌరస్తా నుంచి పరేడ్ గ్రౌండ్స్ వైపు వాహనాలు అనుమతించరు. ప్యారడైజ్ నుంచి ప్లాజా వైపు వెళ్లే వాహనాలపై కూడా ఆంక్షలు విధించారు. వీటిని వేరే దారుల్లో మళ్లిస్తారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









