బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తమ్ముడితో రొమాన్స్ కు రెడీ అంటోన్న శ్రీదేవి కూతురు
- June 01, 2017
మరాఠీలో కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్ తో రిలీజై.. వంద కోట్లను వసూలు చేసిన సినిమాగా 'సైరత్' రికార్డ్ నెలకొల్పిన సంగతి విధితమే.. ఈ సినిమా నూతన నటీనటులైన ఆకాష్ తోసర్, రింకూ రాజ్ గుర లు హీరో హీరోయిన్లు గా నటించారు. చక్కటి ప్రేమకధా చిత్రం గా నిలిచిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకొన్నది. ఈ నేపద్యంలో సైరత్ ను వివిధ బాషల్లో రీమేక్ చెయ్యడానికి అప్పటి నుంచి సన్నాహాలు జరుగుతున్నాయి.. కాగా ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ దక్కించుకొన్నాడు.. కాగా ఈ 'సైరత్' ద్వారా వెండి తెరపై అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు "జాహ్నవి " తెరం గ్రేటం చేయనున్నట్లు బీ టౌన్ టాక్.. అంతేకాదు ఈ సినిమాలో హీరోగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.. బద్రీగానాథ్ కీ దుల్హనియా'తో బ్లాక్ బస్టర్ కొట్టిన శశాంక్ ఖేతాన్ సైరత్ కు దర్శకత్వం వహించనున్నారు.. కాగా జాహ్నవి ఎంట్రీ పై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







