బ్యాంకు వినియోగదారులే టార్గెట్‌గా దొంగతనాలు
- June 02, 2017
బ్యాంకుల నుంచి డబ్బు తీసుకుని, బయటకు వచ్చే వినియోగదారుల్ని టార్గెట్‌గా చేసుకుని ఇటీవల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అబుదాబీ పోలీసులు, ఇదే తరహా కేసులో ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, దొంగల్లో కొందరు బ్యాంకు వినియోగదారుల్ని గుర్తించి, వారి కారు టైర్ ఫ్లాట్ అయ్యిందని చెప్పి, వారి దృష్టిని మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలియవస్తోంది. ఈ తరహా దొంగతనాలకు పాల్పడుతున్నవారిని గుర్తించేందుకు పలు టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు అబుదాబీ పోలీస్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ తరీక్ ఖల్ఫాన్ అల్ ఘౌల్ చెప్పారు. పెద్ద మొత్తంలో డబ్బులు బ్యాంకు నుంచి తీసుకెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. స్ట్రేంజర్స్ ఎదరుపడినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వారి మాయ మాటల్లో ఎట్టి పరిస్థితుల్లో పడరాదని సూచించారు. డబ్బుని పెద్ద మొత్తంలో తీసుకెళ్ళడం కన్నా క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగించడం మంచిదని పోలీసులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







