అబూధాబీ లో ఘనంగా తెలంగాణా అవతరణ దినోత్సవ వేడుకలు

- June 02, 2017 , by Maagulf

అబుధాబి: తెలంగాణా రాష్ట్రం అవతరించి మూడు సంవత్సరాలు పూర్తి అయ్యిన సందర్బంగా యూ ఏ ఈ లో ఉంటున్న తెలంగాణా ప్రాంత వాసులందరు అబూ ధాబీ లోని తెలంగాణా సంఘం ఆధ్వర్యం లో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎంతో ఉల్లాసంగా జరుపుకున్నారు.  యు ఏ ఈ లో ఈ మాసం పవిత్ర రమదాన్ మాసం కావడం చే అక్కడి ప్రభుత్వం ఎటువంటి వినోద కార్యక్రమాలు అంటే ఆట పాటలు జరుప రాదని నిర్దేశించడం తో తెలంగాణా నుండి  కళాకారులను పిలవకుండా అక్కడే నివసిస్తున్న తెలంగానీయుల సమక్షం లో జరుపుకున్నారు.  సంఘ సభ్యుడి ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఈ కార్యక్రమాన్ని ఎంతో మంది తెలంగాణా ప్రాంత కుటుంబాల సమక్షం లో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.  


ఈ కార్యక్రమాన్ని తెలంగాణా తల్లి కి దీప ప్రజ్వలన చేసి తదనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి ప్రారంబించారు.  చిన్నారి సంజన పాడిన గణపతి వందన సమర్పణ తో సాంస్కృతిక కార్యక్రమాలు ఆరంబించారు.  మాస్టర్ కవీష్ పాడిన జై బోలో తెలంగాణా , తెలంగాణా నినాదమే మా నర నరాన అనే గీతం తో ఒక్క సారి గా వాతావరణాన్ని వేడెక్కించాడు.  తదనంతరం ముప్పై ఒక్క జిల్లాల ప్రాశస్త్యం చెప్పే గీతం మరియు మరెన్నో తెలంగాణా భావ జాలం ఉన్న చిన్నారులు పాడిన గీతాలు తెలంగాణా సంస్కృతి ని ఉట్టి పడేలా చేశాయి.పల్లె పాటల పై చిన్నారులు చేసిన నృత్యాలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి.సంఘం సభ్యులందరూ కలిసి జై తెలంగాణా అని రాసి ఉన్న కేక్ కట్ చేసి జయహే జయహే తెలంగాణా గీతం పాడి కార్యక్రమానికి ముగింపు పలికారు.  చివరగా సంఘం ప్రతినిధులు రాజా శ్రీనివాస్, పృథ్వి రాజ్, సదానంద్, వంశీ, గంగా రెడ్డి, పావని, అర్చన, రోజా, భాస్కర్ తదితరులు మాట్లాడుతూ బంగారు తెలంగాణా నిర్మాణం లో గల్ఫ్ లో ఉంటున్న తెలంగాణీయుల పాత్ర ఎంత గానో ఉన్నదని సభకు తెలియ జేస్తూ, ఆ దిశలో  సంఘం తరుపున చేస్తున్న వివిధ కార్యక్రమాలు సభికులకు తెలియజేశారు.  తమ ఆట పాటలతో ప్రేక్షకులందరిని అలరించిన చిన్నారులకు బహుమతి ప్రధానం చేసినారు.  చివరగా తెలంగాణా విందు భోజనం తో సభను ముగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com