ముల్లంగి రైతా

- June 03, 2017 , by Maagulf
ముల్లంగి రైతా

కావలసిన పదార్థాలు: ముల్లంగి - 2, టమేటో -1, ఉల్లిపాయ తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, పెరుగు - 3 కప్పులు, ఎండుమిర్చి - 2, జీరాపొడి - అర టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: టమేటో, ఉల్లిపాయల్ని సన్నగా తరగాలి. ముల్లంగిని మాత్రం తురుముకోవాలి. పెరుగులో ఈ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. తర్వాత కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, జీరాపొడితో తాలింపు పెట్టి పెరుగు మిశ్రమంలో కలపాలి. ఈ రైతా చపాతీల్లోకి బాగుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com