మహేష్ కు పవర్ ఫుల్ ఫాదర్ గా శరత్ కుమార్

- June 03, 2017 , by Maagulf
మహేష్ కు పవర్ ఫుల్ ఫాదర్ గా శరత్ కుమార్

మహేష్-కొరటాల సినిమా ఇటివలే సెట్స్ పైకి వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న మహేశ్‌బాబు 24వ చిత్రం షూటింగ్‌ గత వారం స్టార్ట్ చేశారు. "భరత్ అనే నేను" అనే టైటిల్ ను ఇప్పటికే ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం 'స్పైడర్' సినిమా చేస్తోన్న మహేశ్ .. మరికొన్ని రోజుల్లో అది పూర్తి చేసి, కొరటాల సినిమా షూటింగులో జాయిన్ కానున్నాడు.
కాగ ఈ సినిమాలో మహేశ్ తండ్రి పాత్ర చాలా పవర్ఫుల్ గా వుంటుందట. ఈ పాత్ర కోసం తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ ను ఫైనల్ చేశారని టాక్. తండ్రి పాత్రలలో కనిపించడం శరత్ కుమార్ కి కొత్తేం కాదు. ఇదివరకు బన్నీ సినిమాలో అల్లు అర్జున్ కి తండ్రిగా ఓ పవర్ ఫుల్ రోల్ ప్లే చేశారు శరత్ కుమార్. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com