భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగడంపై ఐసీసీ అధికారిక ప్రకటన
- June 04, 2017
మరికొన్ని గంటల్లో ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మహా సంగ్రామానికి తెరలేవనుంది. భారత్-పాకిస్థాన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూసిన సమయం రానేవచ్చింది. టోర్నీలో భాగంగా టీమిండియా తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో తలపడుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న దానిపై సందేహాలు తలెత్తుతున్నాయి. కారణం బ్రిటన్‌లో తాజాగా చేసుకున్న వరుస ఉగ్రదాడులు చోటు చేసుకోవడమే. భారత కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం 4.30 నిమిషాలకు లండన్‌లో ఉగ్రదాడి చోటు చేసుకుంది.
తెలుపురంగు వ్యాన్‌లో వచ్చిన ఉగ్రవాదులు లండన్ బ్రిడ్జ్‌పై బోరోహ్ మార్కెట్ వద్ద దాదాపు 50 మైళ్ల వేగంతో పాదచారులను ఢీకొట్టారు. అనంతరం అదపుతప్పిన ఆ వ్యాన్ ఓ రెస్టారెంట్ వద్ద గోడను తాకి ఆగిపోయింది. దానిలో నుంచి దిగిన ముగ్గురు ఉగ్రవాదులు కత్తులతో స్వైరవిహారం చేశారు. పలువురు వ్యక్తులను దారుణంగా పొడిచి చంపారు.
రెండు చోటు ఏకకాలంలో నిర్వహించిన ఉగ్ర దాడుల్లో 30 మందికి పైగా గాయపడగా.. ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ఉగ్రదాడిలో గాయపడిన వారిలో ఒక బ్రిటిష్ ట్రాన్స్పోర్ట్ పోలీసు అధికారి, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌కు చెందిన జర్నలిస్టు కూడా ఉన్నారు.
ఈ ఉగ్రవాదుల నడుముకు పేలుడు పదార్థాలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. కాగా, ఉగ్రదాడి జరిగిన ప్రాంతం బర్మింగ్‌హామ్‌కి 208కిలోమీటర్ల దూరంలో ఉంది. ఐసీసీ ఛాంపియన్స్ టోర్నీలో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా టీమిండియా తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో తలపడుతోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ: భారత్-పాక్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకి?
తాజాగా ఉగ్రదాడితో భారత్-పాక్ జరుగుతుందో లేదో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐసీసీ భారత్-పాక్ మ్యాచ్ గురించి ఓ ప్రకటన విడుదల చేసింది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భారీ బందోబస్తు మధ్య మ్యాచ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ట్విట్టర్లో పేర్కొంది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







