అమెరికా ఒర్లాండోలో దుండగుడు కాల్పులు.. ఆరుగురు మృతి

- June 05, 2017 , by Maagulf
అమెరికా ఒర్లాండోలో దుండగుడు కాల్పులు.. ఆరుగురు మృతి

కాల్పుల మోతతో అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటంతో ఓ మహిళ సహా అరుగురు వ్యక్తులు మృతిచెందారు. ఒర్లాండో పట్టణంలోని హ్యాంగింగ్‌ మాస్‌రోడ్డులోని ఒక పారిశ్రామికవాడలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఘటనాస్థలిలోనే నలుగురు మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. అనంతరం కాల్పులకు తెగబడిన వ్యక్తి తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వెనుక కారణాలు స్పష్టంగా తెలియదు.  
దుండగుడు అక్కడే పనిచేసిన 45 ఏళ్ల మాజీ ఉద్యోగి అని అధికారులు తెలిపారు. కాల్పుల నుంచి ఏడుగురు సురక్షితంగా తప్పించుకున్నారని పేర్కొన్నారు. హుటాహుటిన ఘటానాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వారితో కలిసి ఎఫ్‌బీఐ అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com