నిర్మాతగా వస్తానంటున్న ప్రముఖ హీరోయిన్ ప్రణీత
- June 06, 2017
ఒక్కటంటే ఒక్క హిట్టు పడితే చాలు దూసుకుపోయే హీరోయిన్లు చాలా మందే ఉన్నారు మరికొందరేమో వచ్చిన విజయాన్ని కూడా క్యాష్ చేసుకోలేరు. అలాంటి వారిలో బాపు బొమ్మ ప్రణీత పేరు చెప్పుకోవాలసిందే! 'అత్తారింటికి దారేది' ద్వారా ఘన విజయాన్ని అందుకొన్న తరువాత కూడా దాన్ని క్యాష్ చేసుకోలేకపోయిన ఈ చిన్నది నటన తన వల్లకాదనుకొని వ్యాపారం వైపు అడుగులు వేసింది. ఓ రెస్టారెంట్ వ్యాపారం ముందు ప్రారంభించి ఆ తరువాత దాన్ని బార్ అండ్ రెస్టారెంట్‌గా మార్చింది. ఇప్పుడిప్పుడే లాభాలను కళ్ళజూస్తున్న ప్రణీతను 'సినీ నిర్మాతగా మారే ఉద్దేశం ఉందా?' అని అడిగారు. దానికి బదులుగా 'ఇప్పటికిప్పుడు అంటే కుదరదు. భవిష్యత్తులో నిర్మాతగా మారతాను' అని చెప్పింది! ఇంకేముంది? నిర్మాతగా ప్రణీత అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా కొందరు ఔత్సాహికులు కథలు చెబుతామంటూ ఆమె వెంట పడడం మొదలెట్టారట కూడా!
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







