తెలంగాణకు పవర్‌ కట్‌ చేసిన ఆంధ్ర ప్రదేశ్

- June 06, 2017 , by Maagulf
తెలంగాణకు పవర్‌ కట్‌ చేసిన ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణకు విద్యుత్‌ సరఫరాను నిలిపి వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు తాము సరఫరా చేసిన విద్యుత్ కు సంబంధించి రూ. 4, 449 కోట్ల బకాయి ఉందని ఏపీ ప్రభుత్వం తెలంగాణకు తెలిపింది. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేసింది.
 
మంగళవారం నుంచి కరెంటును బంద్‌ చేస్తున్నామని, ఈ బకాయి మొత్తం వెంటనే చెల్లిస్తేనే విద్యుత్‌ సరఫరా చేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తూ తెలంగాణ ట్రాన్స్‌ కో అధికారులకు లేఖ రాసింది. మరి ఈ లేఖపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com