రజని 'కాలా' లో మరో సూపర్ స్టార్ ముమ్ముట్టి
- June 06, 2017
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా కబాలి ఫేమ్ రంజిత్ పా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి విధితమే.. కాలా పేరు తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముంబై లో జరుపుకొంటున్నది.. కాగా ఈ సినిమాలో రజని తో పాటు మలయాళం సూపర్ స్టార్ ముమ్ముట్టిని కూడా ఓ కీలక పాత్రలో నటింపజేయాలని దర్శకుడు భావిస్తున్నాడట.. ఈ మేరకు ఇప్పటికే కధను ముమ్ముత్తికి వినిపించి ఈ పాత్రలో నటించమని అడిగాడనే టాక్ వినిపిస్తోంది.. కానీ ముమ్ముట్టి నిర్ణయం వెల్లడించలేదట..
కాగా ముమ్ముట్టి కనుక కాలా లో నటించడానికి అంగీకరిస్తే.. కొన్ని ఏళ్ల క్రితం వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన దళపతి ని రిపీట్ చేసినట్లు ఉంటుంది అని అంటున్నారు.. అప్పట్లో వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన దళపతి ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే.. ఈశ్వరి రావు, హ్యూమా ఖురేషీ, అంజలి పాటిల్, నానా పటేకర్, సముద్రఖని తదితరులు నటిస్తున్న ఈ సినిమాను రజని అల్లు ధనుష్నిర్మిస్తున్నాడు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







