పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 'వదిన' పిలుపుకి దూరం కాలేను.. మళ్ళీ పెళ్లి చేసుకోలేను

- June 06, 2017 , by Maagulf
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 'వదిన' పిలుపుకి దూరం కాలేను.. మళ్ళీ పెళ్లి చేసుకోలేను

పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ లు బద్రి సినిమా లో జంటగా నటించారు.. ఈ సమయంలో జరిగిన వీరిపరిచయం ఆ తర్వాత ప్రేమగా మారి.. కొంతకాలం సహజీవనం చేసి పెళ్లి చేసుకొన్నారు.. పవన్ రేణు లకు అకీరా, ఆద్యా పిల్లలు.. ఎంతో అన్నోన్యంగా కనిపించే వీరిద్దరూ విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.. పవన్ రేణు దేశాయ్ తో విడాకుల అనంతరం రష్యా కు చెందిన అన్నా లెజినోవా ని పెళ్లి చేసుకొన్నాడు.. కానీ రేణు తో పాటు.. తన పిల్లలకు తండ్రిగా తన భాద్యతను పవన్ నిర్వర్తిస్తూనే ఉన్నాడు.. ఇక రేణు దేశాయ్ కూడా ఎప్పుడూ పవన్ నామస్మరణ చేస్తూనే ఉంటుంది.. పవన్ ని ఇంకా ఎందుకు ప్రస్తావిస్తావు అని ఎవరైనా ప్రశ్నిస్తే.. అందరూ పవన్ పేరు ప్రస్తావించవచ్చు... పవన్ గురించి మాట్లాడ వచ్చు.. నేను మాత్రం ఎందుకు మాట్లాడకూడదు అని తిరిగి ప్రశ్నిస్తుంది.. కాగా చిన్న వయసు కదా.. మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అనే ప్రశ్నని ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న రేణు తాజాగా మళ్ళీ స్పందించింది.. తాను ఎప్పటికీ పవన్ మాజీ భార్యగానే ఉండి పోతానని... తనకు పవన్ భార్యగా ఎంతో గుర్తింపు ఉన్నదని.. ఇప్పటికీ పవన్ ని అభిమానించే వారు.. తనని ఇంకా "వదిన" అని పిలుస్తున్నారు వారి అభిమానానికి ప్రేమకు తాను ఏ మాత్రం దూరం కాలేనని చెప్పింది.. అంతేకాదు.. పవన్ తననుంచి విడాకులు తీసుకొని మరో వివాహం చేసుకోవడం తన ఇష్టం... కానీ తాను మాత్రం మరో పెళ్లి చేసుకోలేనని చెప్పింది.. అయినా విడాకుల అనంతరం మహిళకు పెళ్లి లో ఎన్నో కండిషన్స్ ఉంటాయని మగవారు మళ్ళీ పెళ్లి చేసుకొన్నంత ఈజీగా ఆడవారు చేసుకోలేరని రేణు వ్యాఖ్యానించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com