కళాకారులను ఘనంగా సత్కరించిన 'కళానిలయం'
- June 06, 2017
ప్రముఖ తెలుగు సాంస్కృతిక సంస్థ 'కళానిలయం' త్రితీయ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా జరిగాయి. నవీముంబై వాషీలోని విష్ణుదాసు భావే ఆడిటోరియం లో 'ముంబై జబర్దస్త్' పేరిట నిర్వహించిన ఈ వేడుకల్లో హైదరాబాద్ కు చెందిన సినీ, టీవీ రంగాలకు చెందిన పలువురు కళాకారులు ఆడి, పాడి కార్యక్రామాన్ని రక్తి కట్టించారు. కళానిలయం చైర్ పర్సన్ పి.సుజాతరావు, హైదరాబాద్ కు చెందిన సుదీప అతిథులు, ప్రేక్షకులకు స్వాగతం పలికి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారి హర్షిత కూచిపూడి నృత్యం, 'సోల్ టు సోల్ డాన్స్ అకాడమీ' ప్రదర్శించిన గ్రూప్ డాన్స్, సినీ నేపధ్య గాయని మానసా ఆచార్య, రఘురామ్ పాటలు, జబర్దస్త్ బృందం రచ్చ రవి, ఆడి కిరణ్ ఆట పాటలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. అనంతరం వివిధ రంగాలలోని ప్రముఖుల్ని కళానిలయం తొలిసారిగా ప్రవేశపెట్టిన 'కళానిలయం' అవార్డును ప్రదానం చేశారు. అవార్డు అందుకున్నవారిలో ప్రముఖ రచయత సిరాశ్రీ (సాహిత్య సుధా), దర్శకుడు రామ్ భీమన (విశిష్ట ప్రతిభ), నటి సుభాషిణి (కళారత్న), కూచిపూడి నాట్య కళాకారిణి శైలజా దేశాయ్ (కళానిధి), ప్రముఖ బహుభాషా వ్యాఖ్యాత టి.చలపతిరావు (కళాకోవిద), ప్రముఖ నాట్య కళాకారిణి మేరీ మ్యాక్ మోహన్ పాల్ ను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో కళానిలయం నిర్వాహకులు పాటి బండ్ల సుధాకరరావు, కమిటీ సభ్యులతోపాటు నగరంలోని ప్రముఖులు, తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.




తాజా వార్తలు
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు







