పార్టీ పగ్గాలు చేపట్టనున్న రాహుల్
- June 06, 2017
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. వరుస ఎన్నికల వైఫల్యాలతో రాహుల్ నాయకత్వ పటిమపై విమర్శలు వెల్లువెత్తినా ఆయన పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు అవి అడ్డుకావడం లేదు. మంగళవారం న్యూదిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రస్తుత రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ అక్టోబర్‌లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత ఎన్నికలను డిసెంబర్‌లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. దాదాపు 2005 నుంచి ఈ ఎన్నికలు నిర్వహించడం లేదు. పార్టీ అంతర్గత ఎన్నికలను త్వరలో పూర్తి చేస్తామని గులాం నబీ అజాద్ వెల్లడించారు. ఇది సాధారణమేనని.. పార్టీలోని 2వేల మంది ప్రతినిధులు, సీనియర్ నేతలు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని చెప్పారు. వారే కాంగ్రెస్‌లోని అత్యున్నత నిర్ణయాత్మక వర్కింగ్ కమిటీని కూడా ఎన్నుకుంటారని ఆయన వెల్లడించారు. 1998 నుంచి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇటీవల ఆమె అనారోగ్య సమస్యలతో చికిత్స నిమిత్తం తరచూ అమెరికా వెళ్లాల్సివస్తోంది. దీంతో పార్టీ బాధ్యతలను రాహుల్‌గాంధీకి అప్పగించాలని భావిస్తున్నారు. భారత సమగ్ర పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబడివుందని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. మంగళవారం జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆమె ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగాన్ని రూపుమాపడంలో మోదీ విఫలమయ్యారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శించారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







