ఆహార పదార్థాల కొరతలేదు: ఖతార్ మినిస్ట్రీ
- June 07, 2017
ఖతార్ మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ (ఎంఇసి) ఉన్నతాధికారి, దేశంలో ఆహార పదార్థాల కొరత లేదని స్పష్టం చేశారు. ఎంఇసి అండర్ సెక్రెటరీ షేక్ జస్సిమ్ బిన్ జబెర్ అల్ థని మాట్లాడుతూ, ఖతార్ సర్ప్లస్ ఫుడ్ సప్లయ్ కలిగి ఉందనీ, అన్ని రకాల ఆహార పదార్థాలూ ఎక్కువ మొత్తంలో నిల్వ ఉన్నాయని తెలిపారు. అలాగే ఫుడ్ షార్టేజీ తలెత్తకుండా ఎమర్జన్సీ ప్లాన్ కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. నివాసితులు అలాగే, పౌరులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. పొరుగు దేశాలు ఖతార్‌తో సంబంధాలు తెంచుకోవడంతో దేశంలో ఆహార పదార్థాల కొరత ఉండవచ్చునన్న ప్రచారంతో కొంత ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఖతార్ అధికారిక వర్గాలు పౌరులను అప్రమత్తం చేసి, వాస్తవ పరిస్థితుల్ని వివరించేందుకు ప్రయత్నిస్తోంది.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







