ఒమాన్ 'పనోరమా మాల్'లో 1300 ఉద్యోగాలు

- October 11, 2015 , by Maagulf
ఒమాన్  'పనోరమా మాల్'లో 1300 ఉద్యోగాలు

ఒమన్లోని పనోరమా మాల్లో 1300 ఉద్యోగాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలైడ్ బిజినెస్ గ్రూప్లో భాగంగా పనోరమా మాల్ని నిర్మించారు. రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ డెవలప్మెంట్, హాస్పిటాలిటీ మరియు టూరిజం సెక్టార్, ఎడ్యుకేషన్ మరియు హెల్త్ విభాగాలపై ఆసక్తి ఉన్న సంస్థ ఇది. ఫ్లోర్ మరియు పిల్లర్స్ పూర్తిగా మార్బుల్స్తో అందంగా తీర్చిదిద్దబడటం ఈ మాల్ ప్రత్యేకత అని అలైడ్ బిజినెస్ గ్రూప్ ఛైర్మన్ సలీమ్ అలీ నాజర్ అల్ సియాబీ చెప్పారు. పిల్లల ఆట స్థలం, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోసం మూడు ఫ్లోర్లను కేటాయించారు. ఒమన్లో తొలిసారిగా మూడు కొత్త బ్రాండ్స్ని పనోరమ మాల్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఛైర్మన్ చెప్పారు. మాల్లో మొత్తం 150 ఔట్లెట్స్ ఉంటాయట. 1300 మంది వలస కార్మికులు, ఒమన్ నివాసితులకు ఇందులో ఉద్యోగాలు కల్పించనున్నారట. ఒమన్లోనే పనోరమ మాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఛైర్మన్ సియాబీ చెప్పారు. 


--నూనె  లెనిన్ కుమార్(ఒమాన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com