సిఎం వైఫ్ తో భేటీ అయిన తలైవా

- June 08, 2017 , by Maagulf
సిఎం వైఫ్ తో భేటీ అయిన తలైవా

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్‌ సతీమణి అమృత ఫడణవిస్‌ని కలిశారు. రజనీ కాంత్ లేటెస్ట్ చిత్రం 'కాలా' షూటింగ్‌ కొంత భాగం ముంబయిలో జరుపుకుటుంది.
షూటింగ్ అనంతరం రజనీ .. అమృతని కలిసి పలు సామాజిక అంశాలపై చర్చించారు. ఈ విషయాన్ని అమృత ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ.. 'లెజెండ్‌ని కలిసినందుకు గొప్పగా భావిస్తున్నాను. పద్మవిభూషణ్‌ గ్రహీత రజనీ పలు సామాజిక కార్యక్రమాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు' అని ట్వీట్‌ చేశారు.
కాగా, రజనీకాంత్ రాజకీయాల్లో వస్తున్నారు అనే తరుణంలో ఆయన ప్రతీ భేటి రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com