'MID' కార్యక్రమంలో పాల్గొనుటకు దుబాయ్ చేరుకున్న కామిశెట్టి శ్రీనివాసులు
- June 08, 2017
దుబాయ్: శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 'మ్యూజిక్ ఇండియా దుబాయ్' వారు ఎంతో ఘనంగా 'అన్నమాచార్య సంకీర్తనా వైభవం' ను రేపు దుబాయ్ లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అశేష తెలుగు సంగీత ప్రియుల స్పందన లభిస్తోంది. యూఏఈ గల ఎందరో సంగీతకారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారు వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా నేడు శ్రీనివాసులు గారు దుబాయ్ రావటం జరిగింది.మ్యూజిక్ ఇండియా దుబాయ్ ఫౌండర్ ప్రశాంతి చోప్రా మరియు కుటుంబ సభ్యులు, ఫౌండర్ మెంబెర్ రాకేష్ మారిగంటి,కె.బి.వెంకటేష్,సుధాకర్ మరియు కుటుంబ సభ్యులు శ్రీనివాసులు మరియు మనవడు మా.సాయి చరణ్ ను ఘనంగా విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
ప్రతి ఒక్కరు రేపు 'ఇండియన్ కాన్సులేట్ - దుబాయ్' లో 05 గం.ల నుండి ప్రారంభంకానున్న ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని 'మ్యూజిక్ ఇండియా దుబాయ్' సభ్యులు ఆహ్వానం పలికారు.


తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









