శ్రీలంక చేతులలో ఓటమి రుచిచూసిన భారత్
- June 08, 2017
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కెన్నింగ్‌టన్ ఓవల్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 322 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంక 48.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. దీంతో శ్రీలంక సెమీస్ ఆశలు నిలుపుకొంది. భారత బౌలర్ల పేలవ ప్రదర్శనను సద్వినియోగం చేసుకున్న శ్రీలంక బ్యాట్స్‌మెన్లు గుణతిలక (76: 72 బంతుల్లో 7×4, 2×6), కుశాల్ మెండిస్ (89: 93 బంతుల్లో 11×4, 1×6), ఎంజిలో మాథ్యూస్(52: 45 బంతుల్లో 6×4 ) అర్ధశతకాలతో మెరిశారు. కుశాల్ పెరీరా(47: 44 బంతుల్లో 5×4) గాయంతో మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్‌హార్ట్‌గా వినుదిరగగా, గుణరత్నే(34: 21 బంతుల్లో 2×4, 2×6) తోడుగా మ్యాథ్యూస్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. శ్రీలంక బ్యాట్స్‌మెన్లలో ఇద్దరు రనౌట్ కాగా, భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా కుశాల్ మెండిస్ ఎంపికయ్యాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
శిఖర్ ధావన్ (125: 128 బంతుల్లో 15×4, 1×6) అద్భుతంగా ఆడి శతకం సాధించగా, మరో ఓపెనర్ రోహిత్ శర్మ(78: 79 బంతుల్లో 6×4, 3×6), ధోనీ (63: 52 బంతుల్లో 7×4, 2×6), అర్ధశతకాలతో రాణించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







