ప్రధాని మోదీతో పాకిస్తాన్ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ భేటీ

- June 09, 2017 , by Maagulf
ప్రధాని మోదీతో పాకిస్తాన్ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ భేటీ

భారత్‌, పాక్‌ దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసు.. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాటుతో ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో కజకిస్థాన్‌ రాజధాని అస్తానాలో జరుగుతున్న షాంఘై కోపరేటివ్‌ సమ్మిట్‌(ఎస్‌సీవో) రిసెప్షన్‌లో భారత్‌ ప్రధాని నరేంద్రమోదీ, పాకిస్థాన్‌ పీఎం నవాజ్‌ షరీఫ్‌ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒకరికొకరు అభినందనలు తెలుపుకొని కాసేపు ముచ్చటించుకున్నారు. షరీఫ్‌ ఆరోగ్యం, కుటుంబసభ్యుల క్షేమ సమాచారాన్ని మోదీ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. 2015లో ప్రధాని మోదీ లాహోర్‌ వెళ్లిన సమయంలో షరీఫ్‌ను కలుసుకున్నారు. ఆ తర్వాత రెండు దేశాధినేతలు కలుసుకోవడం ఇదే ప్రథమం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com