బయటకు రాని గోపిచంద్ 'బుల్లెట్'

- June 09, 2017 , by Maagulf
బయటకు రాని గోపిచంద్ 'బుల్లెట్'

గోపిచంద్- నయనతార జంటగా బి. గోపాల్ దర్శకత్వం లో తెరకెక్కిన "ఆరడుగుల బుల్లెట్" ఈ వారం కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు..మూడేళ్లు గా విడుదలకు నోచుకోకుండా ల్యాబ్ కే అంకితం అయినా ఈ మూవీ , ఎట్టకేలకు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పుకొచ్చారు. వీరి హడావిడి చూసి అంత వస్తుందని అనుకున్నారు.
కానీ చివర్లో కొన్ని ఫైనన్షియల్ ఇబ్బందుల కారణంగా సినిమా రిలీజ్ కు అంతరాయం ఏర్పడిందని ఫిలిం సర్కిల్లో చెపుతున్నారు. మొదటి షో మాత్రమే కాన్సల్ అయ్యిందని అన్నారని కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఈరోజు ఈ మూవీ రిలీజ్ కావడం లేదని అర్ధం అవుతుంది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడడం తో థియేటర్స్ లో కంటే డైరెక్ట్ గా బుల్లితెర ఫై ప్రసారం చేస్తే బాగుందనే కామెంట్స్ వేస్తున్నారు. నిజంగా గోపీచంద్ కు ఈ మూవీ ఓ చేదు అనుభవం గా మిగిలిపోయిందని చెప్పవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com