రంజాన్ సందడిలో హైదరాబాద్
- June 09, 2017
ముస్లింల పవిత్రమాసం రంజాన్ సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో సందడి కొనసాగుతోంది. ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు... తెల్లవారు జాము నుంచి సూర్యాస్తమయం వరకు పచ్చి మంచినీళ్లు సైతం ముట్టుకోకుండా నిష్టతో దీక్షలో ఉంటున్నారు. మసీదులు, దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఎటు చూసినా రంజాన్ సందడి కన్పిస్తోంది. మహ్మద్ ప్రవక్త సూక్తుల ప్రకారం రంజాన్ మాసంలో నరక ద్వారాలు మూసుకుని, స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయి. ఈ నెలలో శక్తి మేరకు ఎవరైతే సత్కార్యాలు, ప్రార్థనల్లో నిమగ్నమై ఉంటారో వారు స్వర్గ ప్రవేశానికి అర్హులవుతారని విశ్వాసం. కాబట్టే పాప కర్మల నుంచి విముక్తి పొందడానికి ముస్లింలు ఉపవాస దీక్షలు చేపడుతారు. పవిత్రతే పరమపదసోపానంగా భావించి పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరి హృదయాలు ఆథ్యాత్మిక భావనతో నిండిపోతాయి. ఆకలి కోసం అలమటించే అన్నార్తుల బాధలను స్వయంగా అనుభవించడమే రోజా ఉద్దేశం. దీంతో.. సాటివారి పట్ల సానుభూతితోపాటు దైవచింతన కూడా కలుగుతుందని భావిస్తారు. ఈ సమయంలో కనీసం మంచినీళ్లు కూడా ముట్టరు. రోజూ ఐదుసార్లు నమాజు, ఖురాన్ పఠనం, రాత్రుల్లో తరావీ నామాజుతో ఆరాధనలో లీనమై ఉంటారు. రంజాన్ మాసంలో పేద, గొప్ప తేడాలు చూపకుండా.. శక్తి మేరకు దాన ధర్మాలు, సత్కార్యాలు చేస్తూ ఈద్ ముబార్ వేళకు ముస్లింలు సన్నద్దం అవుతారు. ఉపవాసాలు ముగిసిన తర్వాతి రోజు రంజాన్ పండుగ జరుపుకుంటారు. పాతబస్తీలోని మక్కా మసీదు వద్ద ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మసీదు ఇమామ్ తెలిపారు. ప్రార్థనలకు వచ్చే భక్తుల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని.. మంచి నీరు ,ఫౌంటెన్, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రంజాన్ కావడంతో నగరంలోని చారిత్రాత్మక కట్టడాలైన చార్మినార్, మక్కా మసీదులను అందంగా తీర్చిదిద్దారు. సాధారణ రోజుల్లో పర్యాటకులతో కిటకిటలాడే పాతబస్తీ... రంజాన్ వేళ షాపింగ్‌లతో రద్దీగా మారింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









