సంచలనంగా మారిన రాజశేఖర్ సినిమా

- June 10, 2017 , by Maagulf
సంచలనంగా మారిన రాజశేఖర్ సినిమా

ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మాన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన రాజశేఖర్ కెరియర్ ఇప్పుడు పూర్తి గా తెర మరుగు అయిపోయింది. ఈనేపధ్యంలో హీరోల రేస్ నుండి పూర్తిగా తప్పుకో పడ్డ రాజశేఖర్ గురించి ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం మానివేసారు. అయితే ఇప్పుడు రాజశేఖర్ లేటెస్ట్ గా నటిస్తున్న కొత్త సినిమా 'గరుడ వేగ' పై పెద్దగా అంచనాలు లేకపోయినా ఈ సినిమా పై నిర్మాతలు పెడుతున్న భారీ బడ్జెట్ ఇప్పడు ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది.
క్రియేటివ్ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీని మాములుగా అయితే రాజశేఖర్ సినిమాల్ని జనాలు పట్టించుకునే పరిస్థితిలేక పోయినా ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ఈ సినిమా పై ఊహించని అంచనాలు పెంచడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. అయితే ఈ సినిమాకు ఏకంగా 25 కోట్ల బడ్జెట్ పెడుతున్నారన్న వార్త నమ్మశక్యంగా లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కొన్ని రోజుల క్రితం ఈసినిమా నిర్మాత ఈసినిమాకు 25 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు అని చెప్పగానే చాలామంది నవ్వుకున్నారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం రాజశేఖర్ కు 5 కోట్ల మార్కెట్ కూడ లేని నేపథ్యంలో 25 కోట్లు ఎలా ఖర్చు పెడతారు అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. అయితే ఈమూవీ యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ఈచిత్రానికి నిజంగానే భారీగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే 'గరుడ వేగ' కోసం వంద రోజులకు పైగా వర్కింగ్ డేస్ అయ్యాయట. జార్జియాకు వెళ్లి అక్కడ 33 రోజుల పాటు లాంగ్ షెడ్యూల్ చేశారు అని తెలుస్తోంది. దీనితో ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ ఎపిసోడ్స్ కోసం భారీగానే ఖర్చు అయింది అని వార్తలు వస్తున్నాయి.
అయితే రాజశేఖర్ చివరగా చేసిన 5, 6 సినిమాల్లో ఏమూవీ కూడ ఐదు కోట్లు కలెక్ట్ చేయకపోయినా 'గరుడ వేగ' ఎంత బాగున్నా సరే హిట్ టాక్ తెచ్చుకున్నా 'గరుడ వేగ' 25 కోట్ల షేర్ రాబట్టడం జరిగే పనేనా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com