బహ్రెయిన్ పర్యాటక మరియు ప్రదర్శనల అథారిటీ అల్ జజీరా చానల్స్ పై నిషేధం
- June 10, 2017
మనామా: బహ్రెయిన్ పర్యాటక మరియు ప్రదర్శనల అథారిటీ బుధవారం ఆల్ జజీరా నెట్వర్క్ ప్రసారం చేస్తున్న అన్ని చానెళ్లను నిలిపివేస్తూ ఆ కార్యక్రమాలను ప్రసారం చేయకుండా బహ్రెయిన్‌లో పనిచేసే అన్ని పర్యాటక సంస్థలలో నిషేధించింది. "ఈ అధికారిక సూచనను పరిగణన లోనికి తీసుకొని వారి పర్యాటక లైసెన్సు వెంటనే రద్దు చేయబడతాయని, అలాగే వారికి కల్పించే సౌకర్యాలు సైతం రద్దు చేయబడతాయని హెచ్చరించింది. "ఈ ఆజ్ఞ పట్ల ఉల్లంఘనకు పాల్పడినవారిని , జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటిని అమలుచేయడం ద్వారా చట్టప్రకారం శిక్షింపబడుతుందని బహ్రెయిన్ పర్యాటక మరియు ప్రదర్శనల అథారిటీ తెలిపింది. అల్ జజీరా నెట్వర్క్ కు సంబంధించిన అన్నిటెలివిజన్ ఛానళ్ళను రిసీవర్లను పునఃప్రారంభించడానికి వీలు లేకుండా హోటళ్లు మరియు రెస్టారెంట్లుతో సహా, కింగ్డమ్లో పనిచేసే అన్ని పర్యాటక సంస్థలలో శాశ్వతంగా నిషేధిస్తూ శాసనం చేయబడింది. తాము నిషేధించిన ఇటువంటి ఛానెల్‌లను ప్రసారం చేస్తే ఆయా పర్యాటక సదుపాయాలు రద్దు చేయదమే కాక జైలు శిక్ష మరియు లైసెన్సుల రద్దు చేయబడతాయిని ఆ శాసనంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









