హీరో ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- June 11, 2017
ప్రభాస్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ 'సాహో' స్టార్ట్ అయ్యింది... ప్రస్తుతం చిత్రంలో విలన్ పాత్రధారి నీల్ నితిన్ ముఖేష్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు... ఇదిలా ఉంటే ప్రభాస్ ఈ సినిమా కోసం హిందీ పాఠాలు నేర్చుకుంటున్నాడట. 'బాహుబలి' రెండు పార్టులు ఘనవిజయం సాధించడంతో ప్రభాస్ 'సాహో' పై అంతటా భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.. ఇప్పటికే ఆరంభమైన ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్... ఫైనల్ గా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలయింది... ఈ చిత్రంలో విలన్ నీల్ నితిన్ ముఖేష్ పై హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు డైరెక్టర్ సుజీత్... ఈ విషయాన్ని నీల్ నితిన్ ముఖేష్ 'సాహో' క్లాప్ బోర్డ్ తో సహా.. ఇన్ స్టా గ్రామ్ లో కన్ఫమ్ చేశాడు. అమెరికాలో 'బాహుబలి' సక్సెస్ ను ఎంజాయ్ చేసి ఇండియా వచ్చిన ప్రభాస్ త్వరలో 'సాహో' షూటింగ్ లో పాల్గొంటాడట... తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో యు.వి.
క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. మరోవైపు 'సాహో' కోసం ప్రభాస్ హిందీ పాఠాలు నేర్చుకుంటున్నాడట... 'బాహుబలి'తో బాలీవుడ్ లోనూ క్రేజ్ సంపాదించిన ప్రభాస్ బీటౌన్ ఆడియెన్స్ కు సొంత గొంతు వినిపించాలనుకుంటున్నాడట. బేసిక్ లెవెల్ లో హిందీపై పట్టున్న ప్రభాస్ 'సాహో' తో మరింత మెరుగుపరుచుకుంటున్నాడట.
మరి 'బాహుబలి'తో సృష్టించిన సక్సెస్ మేనియాను.. ప్రభాస్ 'సాహో'తోనూ కొనసాగిస్తాడేమో చూడాలి. బాలకృష్ణ క్విజ్ ఆడండి. రూ.10 వేల బహుమతులు గెలుచుకోండి?
ఈ 20 మంది సినిమా హీరోల సొంత ఊర్లు ఏవో తెలుసా? ఈ 20 మంది హీరోలు మొట్టమొదట నటించిన సినిమాలు ఏవో చెప్పగలరా?
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్‌కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









