స్వాధీనంపై బ్యాంకులకు ఆదేశాలు

- June 12, 2017 , by Maagulf
స్వాధీనంపై బ్యాంకులకు ఆదేశాలు

బహ్రెయిన్‌: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బహ్రెయిన్‌, బహ్రెయిన్‌లోని అన్ని లైసెన్స్‌డ్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌కీ స్వాధీనంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఆయా వ్యక్తులు, సంస్థల పేర్లను బహ్రెయిన్‌, సౌదీ అరేబియా, యూఏఈ, అరబ్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఈజిప్ట్‌తో కలిసి ప్రకటించాయి. ఆ లిస్ట్‌లో ఉన్న వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన బ్యాంక్‌ అకౌంట్లు, ఆస్తులు, డిపాజిట్స్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ అకౌంట్స్‌, ఇన్స్యూరెన్స్‌ పాలసీలు, ఆర్థిక లావాదేవీలు వంటివాటిని నిలుపుదల చేయాల్సిందిగా సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బహ్రెయిన్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com