అమాయకంగా నటించి దొంగతనానికి పాల్పడ్డ వైనం
- June 13, 2017
అజ్మన్ పోలీసులు ఆసియాకి చెందిన ఓ వ్యక్తి నుంచి 24,000 దిర్హామ్‌లు దొంగతనం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ దొంగతనంలో సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అజ్మన్ పోలీస్, పోలీస్ ఆపరేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ అబ్దుల్లా సైఫ్ అల్ మత్రోషి మాట్లాడుతూ, దొంగతనానికి సంబంధించి ఫిర్యాదు అందగానే స్పందించినట్లు చెప్పారు. బాధితుడు బ్యాంకు నుంచి డబ్బుని డ్రా చేసి బయటకు వస్తుండగా, ఓ వ్యక్తి యూఏఈ కరెన్సీ ఎలా ఉంటుందో చూపించమని అడగ్గా, బాధితుడు తాను డ్రా చేసిన 70,000 మొత్తాన్ని చూపించాడనీ, కాస్సేపటి తర్వాత డబ్బులు లెక్కిస్తే అందులోంచి 24,000 దిర్హామ్‌లు తగ్గినట్టుగా గుర్తించి పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడని అధికారులు తెలిపారు. ఇరవై నాలుగ్గంటల్లోనే నిందుతులిద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనీ, అపరిచిత వ్యక్తులు దృష్టి మరల్చి డబ్బు కాజేస్తారు గనుక, ఎవర్నీ విశ్వసించరాదని పోలీసులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







