తమిళం లో వస్తున్న గౌతమీపుత్ర

- June 14, 2017 , by Maagulf
తమిళం లో వస్తున్న గౌతమీపుత్ర

క్రిష్ దర్శకత్వం లో బాలయ్య 100 వ చిత్రంగా సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ అయినా గౌతమీపుత్ర శాతకర్ణి . ఇప్పుడు తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది. వాస్తవానికి తెలుగుతో పాటు తమిళ్ లో ఒకేసారి ఈ మూవీ ని విడుదల చేయాలని ప్రయత్నించారు. కానీ అప్పుడు సమయం లేకపోయిసరికి, వాయిదా వేశారు..ఇప్పుడు దానిని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ మధ్యన బాహుబలి-2 సినిమా కోలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అవడం , రజనీకాంత్, విజయ్, అజిత్ నటించిన హిట్ సినిమాల రికార్డుల్ని కూడా తిరగరాయడం తో ఇప్పుడు శాతకర్ణి చిత్రాన్ని విడుదల చేయాలనీ చూస్తున్నారు. బాహుబలి తరహాలోనే శాతకర్ణి లో కూడా భారీ ఫైట్స్ , గ్రాఫిక్స్ ఉండడం తో ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుందని భావిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com