అక్రమ మద్యం విక్రయిస్తున్న ఇరువురు అరెస్ట్

- June 14, 2017 , by Maagulf
అక్రమ మద్యం విక్రయిస్తున్న ఇరువురు అరెస్ట్

మనామా: చట్టాలు...శిక్షలు ఎంత ఖచ్చితంగా అమలవుతునప్పటికే అక్రమ మద్యం వ్యాపారం ఎక్కడో అక్కడ  జరుగుతూనే ఉన్నాయి. రాజధానిలో ఇరువురు నిందితులు మద్యంను చట్టవిరుద్ధంగా అమ్మేందుకు యత్నిస్తు తమకు దొరికినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. కాపిటల్ గవర్నటే జెనరల్  ఖలీద్ అల్ థావాడి నిందితులు ఇరువురిని అరెస్టు చేసినట్లు ధ్రువీకరించారు. అనుమానితులు ఇద్దరు ఆసియా దేశాలకు చెందినవారు. వీరు జఫ్ఫెయిర్ లో అరెస్టయ్యారు. అనుమానితులను అరెస్ట్ అనంతరం మద్య పానీయాల సరకును జప్తు చేయడమే కాక ఈ కేసుకు సంబంధించినపై పోలీసులు పరిశోధనలు చేస్తున్నారు. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సూచించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు యత్నిస్తున్నట్లు కల్నల్ అల్ తవాది పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com