టాగ్స్ ఆధ్వర్యంలో 'పాటకి పట్టాభిషేకం'
- June 14, 2017
కాలిఫోర్నియా:కాలిఫోర్నియాలో శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్), వేగేశ్న ఫౌండేషన్ హైదరాబాద్‌ల సౌజన్యంతో నిర్వహించిన 'పాటకి పట్టాభిషేకం' కార్యక్రమం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక ఫోల్సోంలోని ఫాల్సం హై స్కూల్ థియేటర్లో పాటకి పట్టాభిషేకం కార్యక్రమం జరిగింది. రామకృష్ణ యనమండ్ర, లలిత నేమన పాడిన ఘంటసాల, బాలు సినీ మధుర గీతాలతో ప్రాంగణంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. పలువురు స్థానిక కళాకారులు పాడిన మధురగీతాలతో ప్రాంగణం పరవశమైపోయింది.
కదలి రండి, కలసి రండి, ఘంటసాల, బాలు సినీ మధుర గీతాలతో పాటకి పట్టాభిషేకం జరుపుకొందాము అని టాగ్స్ ఇచ్చిన పిలుపుకు స్పందించిన స్థానిక తెలుగు కుటుంబాలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మూర్తిదేవి అవార్డు గ్రహీత, పద్మ శ్రీ ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి చక్కని ప్రదర్శన చేసిన రామకృష్ణ యనమండ్ర, లలిత నేమన తో పాటు స్థానిక కళాకారులను అభినందించారు. వేగేశ్న ఫౌండేషన్ వంశీ రామరాజుతో తన 40 ఏళ్ల అనుబంధాన్ని ఆహుతులకు ఆయన వివరించారు. దివ్యాంగులు, అనాథలకు వేగేశ్న ఫౌండేషన్ ద్వారా వంశీ రామరాజు చేస్తున్న సేవలను వివరించడమే కాకుండా, ఇటువంటి సేవా కార్యక్రమాలకు సహాయపడడం ద్వారా శాక్రమెంటో స్థానిక తెలుగు కుటుంబాలు మరింత ఉన్నత స్థాయికి చేరతాయని చెప్పారు. టాగ్స్ కార్యవర్గం సభ్యులు, ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్‌కి జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు.
హైదరాబాద్‌లో తమ ఆశ్రమంలో స్వర్గీయ ఘంటసాలకి గుడి కట్టించామని వేగేశ్న ఫౌండేషన్ వంశీ రామరాజు తెలిపారు. ఈ 'పాటకి పట్టాభిషేకం' కార్యక్రమం ద్వారా వేగేశ్న ఫౌండేషన్ కార్యక్రమాలను శాక్రమెంటో స్థానిక తెలుగు కుటుంబాలవారికి తెలియజేయడం ఆనందకరంగా ఉందని చెప్పారు. 'పాటకి పట్టాభిషేకం' బృందం అమెరికాలో పర్యటించడానికి సహాయ సహకారాలు అందజేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ కి, తెలంగాణా టూరిజం శాఖకు వంశీ రామరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెండు నెలల పాటు అమెరికాలో పర్యటిస్తూ పలు పట్టణాలతో పాటు శాక్రమెంటోలో 'పాటకి పట్టాభిషేకం' జరుపుకోవడం ఆనందగా ఉంది అని ఆయన చెప్పారు. శాక్రమెంటో తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు వంశీ రామరాజును ఘనంగా సన్మానించారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







