గుంటూరు లో అవినీతి నిర్మూలనకు 1100 టోల్‌ఫ్రీ నెంబరు
- June 14, 2017
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతిని నిర్మూలించడానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో బుధవారం మైనింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు, అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. కరప్షన్ కంట్రోల్ మేనేజ్మెంట్ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మైనింగ్ కాంట్రాకర్లు నిజాయితీగా వ్యవహరించి, గొల్లపాలెం తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అవినీతి నిర్మూలన, లంచాలపై సమాచారానికి ఏర్పాటుచేసిన 1100 టోల్‌ఫ్రీ నంబరుకు వచ్చే ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతోనే పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ నెంబరుకు వచ్చే ఫిర్యాదులను పరిశీలించి దర్యాప్తు చేయడానికి 750 మందితో ప్రత్యేక వ్యవస్థ కొనసాగుతుందన్నారు. సమావేశంలో కలెక్టర్ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







