రాష్ట్ర పండగగా దసరా

- October 12, 2015 , by Maagulf
రాష్ట్ర పండగగా దసరా

సరా శరన్నవరాత్రులను ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్ర పండగగా ప్రకటించడంతో ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. దసరాతోపాటు నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన కూడా ఉండడంతో దేశం, రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరానున్న భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. రద్దీకనుగుణంగా అదనంగా సాధారణ బుకింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే విజయవాడ మీSpeciదగా సుమారు 300కిపైగా ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా మరికొన్ని రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళిక రూపొందించింది. అలాగే పలు ముఖ్య రైళ్లకు అదనపు బోగీలను కూడా ఏర్పాటు చేశారు. దసరా 10రోజులు భక్తులకు సమాచారం అందించేందుకు రైల్వేస్టేషన్‌లో స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సేవలు అందించనున్నారురైల్వేస్టేషన్‌ ప్రధాన ముఖ్యద్వారం నుంచి బయటకు వచ్చే భక్తులు ఆవరణలోని బస్టాపు నుంచి అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి దేవస్థానం సమీపంలోని వినయాకుడి గుడి కెనాల్‌రోడ్డు వరకు ఉచిత బస్సులు ఏర్పాటు చేసింది. ఈ బస్సులు ప్రతి అరగంటకు అందుబాటులో ఉంటాయి. భక్తులు ఉచితంగా ప్రయాణించవచ్చు. అలాగే సర్వీస్‌ ఆటోలు కూడా 24 గంటలూ అందుబాటులో ఉంటాయిరైల్వేస్టేషన్‌ ప్రధాన ముఖ్యద్వారం సమీపంలో అమ్మవారి దేవస్థానానికి చెందిన ప్రసాదాం కేంద్రంలో సిబ్బంది 24గంటలూ అందుబాటులో ఉంటారు. ఇందులో పులిహోరా, లడ్డూ ప్రసాదం లభిస్తుంది. దేవస్థానానికి సంబంధించి సమాచారం కూడా ఇక్కడ సిబ్బంది అందిస్తారుఐఆర్‌సీటీసీకి చెందిన పర్యాటక వివరాలు తెలిపే కేంద్రాన్ని రైల్వే స్టేషన్‌ ప్రధాన ముఖద్వారం సమీపంలో ఉంది. 24 గంటలూ సిబ్బంది అందుబాటులో ఉంటూ నగరం, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలకు సంబంధించి సమాచారం ఇక్కడ లభిస్తుందిప్రధాన ముఖద్వారాం సమీపంలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ కేంద్రంలో రీచార్జి కూపన్లు లభిస్తాయి. టెలిఫోన్‌ బిల్లులు కూడా చెల్లించవచ్చు. రూపాయి కాయిన్‌ బాక్సులు కూడా ఏర్పాటు చేశారు. ఎస్‌టీడీ, ఐఎస్‌టీడీ సౌకర్యం ఉన్న ల్యాండ్‌ ఫోన్లు అందుబాటులో ఉన్నాయిరైల్వేస్టేషన్‌ ఆరో నెంబరు ప్లాట్‌ఫాం ఎస్కలేటర్‌ ఆవరణలో మందుల షాపు 24గంటలూ పని చేస్తుంది. అవసరమైన వివిధ రకాల మందులు ఇక్కడ లభిస్తాయిఒకటో ప్లాట్‌ఫాంపైన రెండో అంతస్తులో రైల్వే శాఖకు చెందిన విశ్రాంతి గదులున్నాయి. ఇక్కడ మంచాలతో పాటు ఏసీ, నాన్‌ ఏసీ గదులు అందుబాటులో ఉంటాయి. కన్ఫమ్‌ ఉన్న రైల్వే రిజర్వేషన్‌ టికెట్టు ద్వారా ఆన్‌లైన్‌లో రూమ్‌లు బుక్‌ చేసుకోవచ్చు. ఖాళీలను బట్టి గదులు కేటాయిస్తారు. రైలు ప్రయాణం చేసిన టికెట్టు తప్పనిసరిగా ఉండాలిరైల్వేస్టేషన్‌లోని 1,6,7 ప్లాట్‌ఫాంలపై ప్రయాణికులు తమ లగేజీని భద్రపరుచుకునేందుకు క్లోక్‌ రూమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి 24గంటలూ పని చేస్తాయిఒకటో ప్లాట్‌ఫాం దక్షిణవైపు రెండో ముఖద్వారం వద్ద ఆంధ్రాబ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ ఏటీఎంలు, పార్సిల్‌ కార్యాలయం సమీపంలోని సాధారణ బుకింగ్‌ కేంద్రం వద్ద ఇండియన్‌ బ్యాంకు ఏటీఎంలు ఉన్నాయి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com