వెస్టిండీస్‌ పర్యటన కోసం భారత్‌ జట్టు

- June 16, 2017 , by Maagulf
వెస్టిండీస్‌ పర్యటన కోసం భారత్‌ జట్టు

ఛాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం వెస్టిండీస్‌ పర్యటన కోసం భారత్‌ జట్టును బిసిసిఐ గురువారం ప్రకటించింది. జూలై 23 నుంచి వెస్టిండీస్‌తో 5 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌లో భారత్‌ తలపడనుంది. ఈసిరీస్‌ నుంచి ఓపెనర్‌ రోహిత్‌ శర్మతో పాటు ఫాస్ట్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. వారి స్థానంలో యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ రిషబ్‌పంత్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ని ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు వెల్లడించారు. ఇటీవల ముగిసిన ఐపిఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరుపున రిషబ్‌ పంత్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరుపున కుల్దీప్‌ యాదవ్‌ మెరుగ్గా రాణించిన విషయం తెలిసిందే. కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ, ప్రధాన కోచ్‌గా అనిల్‌ కుంబ్లే ఈపర్యటనకు కొనసాగుతారని బిసిసిఐ స్పష్టం చేసింది. వెస్టిండీస్‌ పర్యటనకు 15మందితో కూడిన జట్టు ఇదే విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), శిఖర్‌ దావన్‌, రిషబ్‌ పంత్‌, అజింక్య రహానే, మహేంద్ర సింగ్‌ ధోనీ (కీపర్‌), యువరాజ్‌ సింగ్‌, కేదార్‌ జాదవ్‌, హార్థిక్‌ పాండ్యా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ, ఉమేష్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, తకుల్దీప్‌ యాదవ్‌, దినేష్‌ కార్తీక్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com