వెస్టిండీస్ పర్యటన కోసం భారత్ జట్టు
- June 16, 2017
ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం వెస్టిండీస్ పర్యటన కోసం భారత్ జట్టును బిసిసిఐ గురువారం ప్రకటించింది. జూలై 23 నుంచి వెస్టిండీస్‌తో 5 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. ఈసిరీస్ నుంచి ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. వారి స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్‌పంత్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ని ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు వెల్లడించారు. ఇటీవల ముగిసిన ఐపిఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరుపున రిషబ్ పంత్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తరుపున కుల్దీప్ యాదవ్ మెరుగ్గా రాణించిన విషయం తెలిసిందే. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లే ఈపర్యటనకు కొనసాగుతారని బిసిసిఐ స్పష్టం చేసింది. వెస్టిండీస్ పర్యటనకు 15మందితో కూడిన జట్టు ఇదే విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ దావన్, రిషబ్ పంత్, అజింక్య రహానే, మహేంద్ర సింగ్ ధోనీ (కీపర్), యువరాజ్ సింగ్, కేదార్ జాదవ్, హార్థిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, తకుల్దీప్ యాదవ్, దినేష్ కార్తీక్.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







