సందీప్ కిషన్ హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో ఆర్డీజీ ప్రొడక్షన్స్ కొత్త చిత్రం
- June 16, 2017
`బ్రహ్మ లోకం టు యమలోకం వయా భూలోకం`, `సినిమా చూపిస్త మావ`, `ఉహేలి` (బెంగాలి) చిత్రాల నిర్మాతల్లో ఒకరైన రూపేష్. డి.గోహిల్ తాజాగా సోలో నిర్మాతగా సినిమాను రూపొందించడానికి సిద్ధమయ్యారు. యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవల `కిట్టు ఉన్నాడు జాగ్రత్త` చిత్రంతో విజయాన్ని చవిచూసిన వంశీకృష్ణ దర్శకత్వంలో ఈ తాజా సినిమా రూపొందనుంది.
నిర్మాత రూపేష్ డి. గోహిల్ మాట్లాడుతూ ``ఇంతకు మునుపు పార్ట్ నర్ షిప్‌తో `బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం`, `సినిమా చూపిస్త మావ`, `ఉహేలి` (బెంగాలి) అనే సినిమాలను రూపొందించాం. తాజాగా సోలో నిర్మాతగా సందీప్ కిషన్ హీరోగా సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాం.sensational writer ప్రసన్నకుమార్ బెజవాడ చెప్పిన కథ నచ్చింది. సకుటుంబంగా కూర్చుని చూసే సినిమా అవుతుంది. కుటుంబ విలువలున్న వినోదాత్మక చిత్రమవుతుంది. జులై 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. అగ్రభాగాన్ని హైదరాబాద్‌లోనే తెరకెక్కిస్తాం. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం`` అని అన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, సంగీతం: రథన్, కెమెరా: `భలే భలే మగాడివోయ్` ఫేమ్ నిజర్ షఫి, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







