హెల్మెట్ లేకుండే పట్టుబడితే జరిమానా కట్టాల్సిందే
- October 12, 2015
నవంబర్ 1 నుంచి హెల్మెట్ వాడకం తప్పనిసరి. అలా లేకుండే పట్టుబడితే జరిమానా కట్టాల్సిందే. కచ్చితంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.' అని రవాణా శాఖ కమిషనర్ బాల సుబ్రహ్మణ్యం తెలిపారు. గుంటూరులోని రవాణా శాఖ కార్యాలయంలో సోమవారం ఆయన తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసి న హెల్ప్ డెస్క్‌ను, కార్యాలయంలో ఇతర వసతుల ను, అధికారుల పనితీరును పరిశీలించారు. నవంబర్ 1 నుంచి హెల్మెట్ తప్పనిసరి, హెల్మెట్ దరించండి మీ ప్రాణాలు కాపాడుకోండి అన్న నినాదాలతో రూపొందించిన ఫ్లెక్సీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రవాణా శాఖలో ఏజెంట్ల వ్యవస్థను పూర్తి స్థాయిలో రూపుమాపేందుకు కఠిన చర్యలు చేపట్టామన్నారు. ప్రజల ఇబ్బందుల పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దరఖాస్తులు ఇంగ్లీష్‌లో ఉండటం, అందులోనూ అర్థం కాని ప్రశ్నల వల్ల దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుందని అనేక మంది తనకు ఫిర్యాదు చేశారన్నారు. ప్రస్తుత దరఖాస్తులకు స్వస్తి పలికి సరళంగా ఉండేలా నూతనంగా ద రఖాస్తులను రూపకల్పన చేస్తున్నామన్నారు. ఈ దరఖాస్తులు తెలుగులోనూ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అయితే దీన్ని కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అ యినా వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అందుబాటులో కి తీసుకువస్తామన్నారు. ఇతర దేశాల్లో దరఖాస్తు విధానాలు ఇప్పటికే పరిశీలించామని, అవి చాలా సులభతరంగా ఉన్నాయన్నారు. ఆ తరహాలో దరఖాస్తుల రూపకల్పన పూర్తి కావచ్చిందన్నారు. వీటి ని కేంద్రానికి పంపి వారి అనుమతి తీసుకుంటామన్నారు. గుంటూరు రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌లు భేషుగ్గా పని చేస్తున్నాయన్నారు. తనిఖీ అధికారులకు టాబ్లెట్స్ వాహన తనిఖీ అధికారులకు త్వరలోనే టాబ్లెట్స్, కెమెరాలు అందిచనున్నట్లు తెలిపారు. ఏడాది చివరి నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయన్నారు. తనిఖీ సమయంలో ఆ వాహనానికి అధికారులు గతం లో ఎన్ని సార్లు జరిమానాలు విధించారు, వాహనం కండిషన్, ట్యాక్స్ పెండింగ్, ఇన్సూరెన్స్ ఉందీ లేనిదీ ఇలా అన్ని వివరాలు టాబ్లెట్ల ద్వారా అధికారులు తెలుసుకోవచ్చన్నారు. ఇక కెమెరాల వల్ల వాహనాన్ని అధికారి ఏ పరిస్థితుల్లో నిలిపి తనిఖీ చేశారు, ఆ సమయంలో డ్రైవర్ స్థితిగతులు, వారి మధ్య సంభాషణలు రికార్డు చేసే అవకాశం ఉంటుందన్నారు. దీని వల్ల అధికారుల్లోనూ జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీటీసీ రాజరత్నం, ఆర్టీవో రామ స్వామి, ఏవోలు ప్రతాప్, కరీం, మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్లు ఉమామహేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







